Followers

దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గమే


దేశ సంపదను సృష్టించేది శ్రామిక వర్గమే : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి.

 

     స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

శ్రామిక వర్గం దేశ సంపదలో ప్రధాన భూమిక పోసిస్తుంటే దేశ సంపద సృష్టికర్తలు కార్పొరేట్ రంగమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించడం విడ్డురంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి విమర్శించారు. మేడే సందర్భంగా శుక్రవారం ఉదయం సీపీఐ కార్యాలయంలో జెండా అవిష్కరణ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపద శ్రామిక వర్గం నుంచే సమకూరుతోందని ఇలాంటి శ్రామిక వర్గ కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ వర్గానికి ఊడిగం చేస్తోందని   ఆందోళన వ్యక్తం చేశారు.     రెక్కాడితే గాని డొక్కాడని కార్మిక వర్గం నేడు పస్థులు ఉంటున్నారు. అసంఘటిత కార్మికులకు జీతాలు చెల్లుంచేందుకు ముందుకు రావడం లేదు. మరో పక్క ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు జీతాలు చెలించాలని చెబుతోంది అయిన కార్పొరేట్ రంగం ఆ వైపుగా చర్యలు తీసుకోవడం లేదు వలస కూలీల పరిస్థితి దననియంగా ఉంది. దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ దిగ్గజాల రుణాలు సుమారు 68 వేల కోట్ల రూపాయల  మాఫీ  చేయడం దారుణమన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల రుణాలు మాపీ చేయమంటే దేశఆర్టిక వ్యవస్థ తలకిందులు అవుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు తిండి పెడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న ప్రతీ కార్మిక కుటుంబాలకు 10 వేల రూపాయలు చొప్పున్న ఇవ్వాలని సీపీఐ తరుపున డిమాండ్ చేశారు. 8 గంటల పనిదినం సాధించుకోవడానికి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న విధానానికి స్వస్తి పలికి నేడు 12 గంటల పనివిధానం ప్రవేశ పెట్టాలని చూడడం దుర్మార్గం అన్నారు. కార్పొరేట్ రంగాలకు ఊడిగం చేసే విధానాలకు స్వస్థి పలికి కార్మిక వర్గాలకు చేయుతనందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కాసులరెడ్డి,అప్పన్న, ఎర్రయరెడ్డి, రాజు, అన్వేషి, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...