గుమ్మల్లదొడ్డి లో ప్రతీ ఇంటికి కోడి గుడ్లు పంపిణీ
గోకవరం పెన్ పవర్.
తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి లో దాతలు తమ ఔదార్యాన్ని చాటుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ ఇంటికి పరిమితం అయ్యారు..ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి ప్రజల కు తన వంతుగా సహకరించాలని ఇదే గ్రామానికి చెందిన శరకణం మురళీ కృష్ణ కుటుంబం నిర్ణయించుకుంది. వైద్యులు ఇస్తున్న సలహా మేరకు ప్రోటీన్లు అధికంగా ఉండే కోడి గుడ్లు పంపిణీ చెయ్యడానికి ముందుకు వచ్చారు. సుమారు 1200 పై చిలుకు కుటుంబాలకు 65,000/- విలువ చేసే కోడిగుడ్లను స్వయంగా ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత మురళీ కృష్ణ మాట్లాడుతూ, తాను ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు గా పని చేస్తున్నాను అని, కూలీలు పడుతున్న ఇబ్బందులు తెలుసు కనున , కార్మిక దినోత్సవం రోజున గ్రామంలోని ప్రతీ ఇంటికి స్వయంగా గుడ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, స్థానిక యువకులకు కృతజ్ఞతలు తెలిపారు...
No comments:
Post a Comment