నిరుపేదలకు బాసటగా భాస్కర్
అనకాపల్లి, పెన్ పవర్
కష్టకాలంలో పేదలకు అండగా నిలిచి వారికి ఎంతోకొంత మనోధైర్యం ఇవ్వాలని సమాజ సేవకుడు, 80వ వార్డ్ వైస్సార్సీపీ ఇంచార్జ్ కొణతాల భాస్కరరావు పేర్కొన్నారు. సతీమణి వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని నీలిమతో కలిసి గురువారం పేదలకు సహాయం చేశారు. ఎస్ రాయవరం మండలం వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనకాపల్లి, గవరపాలెంలో గల కర్రి పెద్దయ్య గారి వీధి, బుద్ధ రామదాసు గారి వీధులలో నివసించే వృద్ధులకు,నిరాధారులకు బియ్యం, పప్పు దినుసులు, కాయకూరలను వీరి ఇంటికి పిలిచి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కరోనా కష్టసమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని తామే స్వయంగా గుర్తించి తమ వంతు సేవ చెయ్యటం కోసం మేము ఎప్పుడు సిద్దమేనని అది బాధ్యతగా భావిస్తున్నామన్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి విపత్తు సమయంలో నిరుపేదలకు అండగా ఉంటుు భాస్కర్ నీలిమ దంపతులు అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు. సామజిక సేవ చెయ్యటం మాత్రమే కాకుండా ప్రజలకు ప్రభుత్వ పధకాలు చేరేలా కూడా చూస్తున్న వారు అబినందనీయులని అన్నారు.ఈ కార్యక్రమంలో కె.ఎమ్.నాయుడు,కాండ్రేగుల శ్రీరామ్,కోరిబిల్లి పరి,కోరిబిల్లి ఆరుద్ర,కర్రి అప్పాజీ, విల్లూరి సంతోష్,కొణతాల చందు, అరవింద్ మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment