Followers

వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం


 


వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం

-- జిల్లా ఎస్పి బాబు జీ

 

అనకాపల్లి,పెన్ పవర్

 

 వలస కార్మికులను త్వరలోనే వారి వారి స్వస్థాలలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ పేర్కొన్నారు. అనకాపల్లి దిశా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. దిశ సిబ్బంది , అధికారులు పనితీరుపై జగన్ అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే జార్ఖండ్, భీహార్ రాష్ట్రలకు చెందిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించామని తెలిపారు. ఒరిస్సా వలస కూలీలను కూడా త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు అనుగుణంగానే ప్రజలు నడుచుకోవాలని సూచించారు. పోలీసులకు సహకరించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే జిల్లా మొత్తంలో  లాక్ డౌన్ ఉల్లంఘిన  కింద 7000 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 74000 మోటార్ వాహనాల కేసులు, రూ.3.3కోట్లు ఎమ్ వి కేసుల అపరాధ రుసుము వసూలు చేసినట్లు వెల్లడించారు. మావోయిస్టుల కధలికలపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం గా ఉందన్నారు. లాక్ డౌన్లో మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజనులకు సంతలు లేకపోవడంతో 5000మంది గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసామనారు. పోలీసుల పనితీరును అభినందించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...