పంచగ్రామాల ఫలసాయాలు కూరగాయలపై నిషేధం.
కేంద్రానికి సూచించిన నీరి నిపుణుల బృందం.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
ఎల్జి పాలిమర్స్ విషవాయువు ప్రభావం కారణంగా పంచ గ్రామాల్లో పండిన ఫల సాయాలు కూరగాయలను నిషేధించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో రసాయన విషవాయువు ప్రభావం వాటిపై ఉంటుందని ఆ కారణంగా వాటిని తీసుకోవద్దని నిపుణుల బృందం సూచించింది. ఎల్జి పాలిమర్స్ రసాయన విషవాయువు లీకైన కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు ఆరు వందల వరకు ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటనపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్( సి ఎస్ ఐ ఆర్) మరియు జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన పరిశోధన సంస్థ ( ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ) ల నిపుణుల బృందం క్షేత్ర స్థాయి లో పరిశీలించి రసాయన విషవాయువు స్టెరైన్ రేణువులను రోడ్లు ఇళ్లల్లో గుర్తించడం జరిగిందని బృందం పేర్కొంది. ఒక ఇంటిలో 1.7 పీపీఎం స్టార్ ఇన్ రేణువులు అధికంగా పడి ఉన్నాయని తెలిపారు. విషవాయువు ప్రభావం వల్ల స్థానిక ప్రజలు ఏడాది పొడుగునా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. వాయువు తాకిన చెట్లను మొక్కలను జీవీఎంసీ ఆధ్వర్యంలో తొలగించాలని బృందం సూచించింది. మూడు కిలోమీటర్లు పంచ గ్రామాల్లో రసాయన విషవాయువు ప్రభావం ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నీ నివేదికతో పంచ గ్రామాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment