ఇందిరా భీమ్ సంజయ్ నగర్ ప్రాంతంలో ద్రోణంరాజు శ్రీనివాస్ పర్యటన
పూర్ణా మార్కెట్, పెన్ పవర్ :
జీవీఎంసీ దక్షిణ నియోజకవర్గం పూర్వం 15 ప్రస్తుతం 27 వార్డులో ద్రోణంరాజు శ్రీనివాస్ పర్యటన....
డైమండ్ పార్క్ రోడ్డు శంకర మఠం ఆనుకొని ఉన్న ఇందిరా భీమ్ సంజయ్ నగర్ ప్రాంతాన్ని వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ శుక్రవారం ఉదయం కరోనా వ్యాధి విస్తరిస్తున్న దృశ్య సందర్శించి ఈ ప్రాంతంలో నివసిస్తున్నప్రజలను రజకులను ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రేషన్ డిపో నెంబర్ 30 నెంబరులో ఇస్తున్న సరుకుల నాణ్యత వివరాలను, తూనికలను స్వయంగా ఆయన పర్యవేక్షించారు ఈ సందర్భంగా వార్డు లో నివసిస్తున్న ప్రజలకు" కరోనా వ్యాధి...లక్షణాల నివారణ చర్యలను వివరించారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలని వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య పనివారికి పోలీస్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు,
ఈ కార్యక్రమంలో వార్డు వైయస్సార్సీపి కార్పొరేటర్ అభ్యర్థి సర్వేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు,
No comments:
Post a Comment