వారపు సంత అనధికార వసూళ్లు పై పోలీసులకు ఫిర్యాదు.
పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు.
పరవాడ, పెన్ పవర్
మండల గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మంగళవారం జరిగిన వారపు సంతలో అనధికారికంగా ఆశీలు వసూళ్లు చేసిన వారిపై గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు తెలిపారు. వారపు సంతలో ఆశీలు వసూళ్లు చేయాలంటే గ్రామపంచాయతీ నిర్వహించే టెండర్ను దక్కించుకున్న వాళ్ళు మాత్రమే వసూళ్లు చేయాలని అలా కాకుండా అనధికారికంగా గ్రామపంచాయతీ పేరుతో ఆశీల్లు వసూళ్లు చేస్తున్నారని స్థానికులు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. పంచాయతీ అనుమతి లేకుండా, పంచాయతీ పేరు చెప్పి వారపు సంతలో ఆశీలు వసూళ్లు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వారపు సంతలో అనధికారికంగా వసూలు చేసిన నగదును రికవరీ చేస్తామని అన్నారు.
No comments:
Post a Comment