పూజలు చేసే చేతులు కన్నా సాయం చేసే చేతులు మిన్న
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్
సహాయమే సంస్కారం అనే స్ఫూర్తితో విశాఖపట్నం పోర్ట్ డాక్ ఎంప్లాయిస్ అండ్ సెక్టార్ సిక్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పారిశుధ్య కార్మికులకు, వాలంటరీ లకు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రెటరీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రాణభయంతో వణికిస్తూ, ప్రాణాలను హరిస్తూ, తిండి, నిద్ర తీరిక లేకుండా భయభ్రాంతులను గురి చేస్తున్న మహమ్మారి కరోనా తో ప్రపంచం తలకిందులైన తరుణంలో.. సంఘంలో చాలామంది మేముసైతం అంటూ.. భయపడకండి మేమున్నామని స్టే హోం.. స్టే సేఫ్ అంటూ వైద్యులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, రాత్రింబవళ్లు చేసే సేవ అనితర సాధ్యం... ఆ కోవలోనే ఎంవీపీ లో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇప్పటివరకు కాలనీలో అనేక సేవా కార్యక్రమములు చేయడం జరిగిందని కాలనీలో అందరికీ కరోన వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవి ఎలా తీసుకోవాలి, అలాగే సామాజిక దూరం పాటించడం పై కాలనీవాసులు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి మాస్క్ లను పంపిణీ చేయటం జరిగింది. దగ్గరే ఉన్న క్యాన్సర్ హాస్పటల్ కు వచ్చు రోగులకు భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఎంవిపి యంగ్ స్టార్ యూత్ వారు కూడా పేదలకు సహాయం చేస్తున్న తరుణంలో వారిని గుర్తించి తమ అసోసియేషన్ తరపున 16 వేల రూపాయల వస్తు సామాగ్రిని, భోజన సామాగ్రిని అందించడం జరిగిందని, తాము కూడా పేదలకు కూరగాయలను పంపిణీ చేయడం జరిగిందని, ఈ సేవా కార్యక్రమంలో తమ సంఘ సభ్యులు చేదోడువాదోడుగా తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరిగిందని, కాలనీలో ఏ సహాయం కావాలన్నా తాము ముందుంటామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ పరశురాం, కే రాము, బి. లక్ష్మణరావు, పి. అప్పలరాజు, ఎల్. సత్యం, ఎల్ ప్రభాకర్, వి ధనరాజు, ఆర్ కేశవ, కే సత్తి రాజు, వి వి వి ప్రసాద్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment