చినారికట్లలో 6858 మాస్కులు పంపిణీ
(పెన్ పవర్, చినారికట్ల)
మండలంలోని చినారికట్ల సచివాలయంలో శనివారం డిఆర్‌డిఎ ఆధ్వర్యములో తయారుచేసిన మాస్కులను మాజీ యంపిపి ఉడుముల రామనారాయణరెడ్డి పంపిణీ చేశారు. చినారికట్లలో 6858 మాస్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మండలంలోని 26 పంచాయితీలల్లో ఒక్కొక్కరికి మూడు మాస్కులను పంపిణీ చేసేందుకు లక్షా 20 వేల మాస్కులను స్వయం సహాయక పొదుపు గ్రూపు మహిళల ద్వారా తయారుచేసే ఏర్పాట్లు చేస్తున్నామని ఇందిరాక్రాంతి పధం ఎపియం కె గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమములో ఇఒఆర్ డి కె రాజకుమారి, యంపిపి, జట్పిటిసి అభ్యర్థులు మోరబోయిన మురళి, అక్కిదాసరి ఏడుకొండలు, విఆర్ పురుషోత్తమరెడ్డి, సిసిలు రాజయ్య, వేల్పుల ఎజ్రా, రామయ్య, బనయ్య, గ్రామవాలంటీర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment