65 కుటుంబాలకు ధోమతెరలు పంపిణీ .
వి.ఆర్.పురం, పెన్ పవర్ .
వి.ఆర్.పురం మండలం ఇప్పురు గ్రామంలో 65 కుటుంబాలకు ధోమతెరలు పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్బంగా జిడిగుప్ప పి.హెచ్.సి డాక్టర్ సుందర్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వ్యాధి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మస్కులు ధరించాలి. పరిశుభ్రత పాటించాలి. మీ గ్రామంలో ఎవరికైనా జ్వరం దగ్గు వచ్చినట్లు ఐతే వెంటనే ఆశ వర్కర్కి గాని ప్రభుత్వ వైద్య శాలకు తీసుకొని వెళ్లవలెను. మీ గ్రామంలోకి క్రొత్తవారు వచ్చినట్లైతే ఆశ వర్కర్ డాక్టర్ కి తెలియపరచవలెను .మీ గ్రామంలో ఎవరైన గర్భిణి స్త్రీలు ఉన్నట్లయితే జిదిగుప్ప పి.హెచ్.సి లో పిడర్ అబులెన్స్ ఉన్నది. వారికి సమాచారం ఇచినట్లైతే వెంటనే వారు వచ్చి వైద్య శాలకు తీసుకొని వెళ్తారు. జిడిగుప్ప పంచాయతీలో గలా కొండ రెడ్ల గ్రామాలకు అందుబాటులో ఉంటూ ఉదయం రాత్రి అని తేడా లేకుండా వైద్యం అందించటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సోఢీ బజారు ఆశ వర్కర్ ఎం.మహాలక్ష్మీ స్.శైలేంద్ర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment