సిఎం సహాయనిధికి సిరిమల్లె కోటి ఆధ్వర్యంలో రూ.50 వేలు డిడి అందజేత
(పెన్ పవర్, పొదిలి)
పొదిలి మండలం మూగచింతల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సిరిమల్లె కోటి, దేవరపు వెంకటేశ్వర్లు, కొప్పుల వెంకట్రావు, తాటికొండ నాగేశ్వరరావు, వేమ వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50,000 ల డిడిని మార్కాపురం శాసన సభ్యులు కుందురు నాగార్జునరెడ్డి కి అందజేశారు. పొదిలి లోని మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి స్వగృహం నందు ఎమ్మెల్యేను కలిసి డిడి అందజేశారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడముల శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment