Followers

భక్తజనం లేకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి


భక్తజనం లేకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి..

 

పోలవరం, పెన్ పవర్

 

 పోలవరం మండలంలో అఖండ గోదావరి నదీతీరాన ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి వేడుకలను వైరస్ ప్రభావంతో ఘనంగా జరుపుకో లేక పోయామని   వాసవి క్లబ్ గౌరవ అధ్యక్షులు చెక్క వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు పైడిపల్లి ఫణి కుమార్ శర్మ  మాట్లాడుతూ ఆర్యవైశ్య కమిటీ సభ్యులు పెరుమల్ల సూర్యనారాయణ మూర్తి, ఎక్కి శెట్టి వెంకట రాజా సూచనల మేరకు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 4638 వ జయంతి వేడుకలను శనివారం భక్తజనం లేకుండానే నిర్వహించామన్నారు. సాంప్రదాయ పధ్ధతిలోనే అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన నిరాడంబరంగా అర్చకులు చే నిర్వహించారు. అనంతరం వాసవి క్లబ్ గౌరవ అధ్యక్షులు చెక్క వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 18 కలిసాలు ఏర్పాటు చేసి దివ్య పంచామృత స్థానం చేయించి స్త్రీల చే సామూహిక లక్ష కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగేవని ఈ సంవత్సరం వైరస్ మహమ్మారి సోకడంతో ప్రభుత్వ, పోలీసు అధికారులకు సూచనలు పాటిస్తూ నిరాడంబరంగా భక్తజనం లేకుండా అర్చకుని చే సాధారణ పూజా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. మహమ్మారి పూర్తిస్థాయిలో తొలిగిపోవాలని మరుసటి సంవత్సరం భక్తజనంతో ఘనంగా అమ్మవారి జయంతి వేడుకలు జరుపుకోవాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...