40 వ రోజుకి చేరుకున్న పార్డ్ ఇండియా అన్నదాన సంకల్పం
పెన్ పవర్, దేవరపల్లి
దేవరపల్లి మండలం లోని యర్నగూడెం మరియు త్యాజంపూడి గ్రామాల్లో లాక్ డౌన్ వలన కష్టాలు పడుతున్న 60 మంది వృద్దులకు, వలస కార్మికులకు, అసహాయులకు పార్డ్ ఇండియా ఉచిత భోజన సౌకర్యం కల్పించింది. శ్రీ విజయదుర్గా మెకానికల్ వర్కర్ల యూనియన్ అధ్యక్షులు, పార్డ్ ఇండియా గ్రామ కమిటీ సభ్యులు కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు సౌజన్యంతో ఈనాటి ఆహార పంపిణీ దిగ్విజయంగా సాగింది.40 వ రోజుకి చేరుకున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు, పార్డ్ ఇండియా సోషల్ క్యాంపెయినర్ సుంకవల్లి సత్తిరాజు, కోఆర్డినేటర్ సోమిశెట్టి వెంకట్రావు, కొంపెల్లి బాబూరావు, ఏలూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు దాతృత్వాన్ని పార్డ్ ఇండియా జాతీయ కార్యవర్గం అభినందించిందని సుంకవల్లి సత్తిరాజు పేర్కొన్నారు.
No comments:
Post a Comment