4న జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం
కరోనాపై సందేహాల నివృత్తి
విజయనగరం, పెన్ పవర్
కరోనా నియంత్రణకు సంబంధించి ఈ నెల 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలనుంచి 11 గంటలు వరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ప్రజలతో ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. జిల్లా ప్రజలు 08922-276177, 08922-278876 నెంబరుకు ఫోన్ చేసి, నేరుగా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కరోనా మహమ్మారి, దాని వ్యాప్తి గురించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే కరోనా నియంత్రణకు అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ కోరారు.
No comments:
Post a Comment