Followers

మానవత్వాన్ని చాటుకున్న జి.మాడుగుల ఎస్సై ఉపేంద్ర


 


జి.మాడుగుల, పెన్ పవర్ 


పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణులను ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న జి.మాడుగుల ఎస్సై ఉపేంద్ర. ఒక వైపు భారీ వర్షం, చిమ్మచీకటి, మరోవైపు అత్యంత మారుమూల ప్రాంతమే కాకుండా మావోయిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన కిలంకోట పంచాయతీ కె.బందవీధి గ్రామంలో సోమవారం రాత్రి ఇద్దరు మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. బైక్ అంబులెన్స్ బొయితిలి వరకు వెళ్ళింది. భారీ వర్షం కావటంతో ముందుకు వెళ్లలేకపోయింది ఇందుకుతోడు రహదారి సదుపాయం సక్రమంగా లేదు. ఈ విషయం స్థానిక ఎస్సై ఉపేంద్రకు తెలియటంతో  వెంటనే స్పందించారు. ప్రయివేటు జీపును గ్రామానికి పంపించి పురిటి నొప్పులతో బాధపడుతున్న అనుగురి. మత్యకొండమ్మను ముందుగా మద్దిగరువు వరకు తరలించి బైక్ అంబులెన్స్ ద్వారా జి.మాడుగుల తరలించారు. అదే గ్రామానికి చెందిన సాగేని.ఈశ్వరికి పురిటి నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతుందని సమాచారం రావటంతో అదే జీపులో మరో సారి  గ్రామానికి వెళ్లి గర్భిణిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి అనుగురి మత్యకొండమ్మ పాపాకు జన్మనివ్వగా, సాగేని ఈశ్వరి బాబుకు జన్మనిచ్చింది. మంగళవారం ఎస్సై ఉపేంద్ర ఆసుపత్రికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాగేని ఈశ్వరి రక్తహీనతతో బాధ పడుతుండటంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. సరియైన సమయానికి స్పందించి ఆసుపత్రికి తరలించిన పోలీసులకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు చెప్పారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...