దేశవ్యాప్తంగా మే 17వరకు లాక్‌డౌన్ పొడిగింపు
గ్రీన్ జోన్లు, ఆరేంజ్ జోన్లలో ఆంక్షల సడలింపు
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
కరోనా వైరస్ పరిపూర్ణంగా నిర్మూలన జరగాలని కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించి గ్రీన్ ఆరంజ్ జోన్స్ లో ఆంక్షలు సడలించారు విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు బంద్. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్. స్విమ్మింగ్ పూల్స్, స్టేడియంలు మూసి ఉంచాలి, అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ఈవెంట్లు రద్దు, అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి. గ్రీన్ జోన్లు, ఆరేంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు,రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు వారంకు ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితి పరిశీలన కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్పు గ్రీన్, ఆరేంజ్ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం గ్రీన్ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి ఆరేంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి, ఆరేంజ్ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి .ఆరేంజ్ జోన్లు: టూ వీలర్ మీద ఒక్కరికే అనుమతి, ఆరేంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు.
No comments:
Post a Comment