సిఎం సహాయనిధికి రూ.1 లక్ష అందించిన కంభాలపాడు గ్రామ నాయకులు
(పెన్ పవర్, పొదిలి)
మండలంలోని కంభాలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 లక్ష డిడిని శనివారం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డికి స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా తెళ్లపరెడ్డి నారాయణరెడ్డి రూ.25 వేలు, నాగిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి రూ. 25 వేలు, బుగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రూ. 25 వేలు, కల్లూరి భాస్కర్ రెడ్డి రూ.25 వేలు కలిసి రూ.1 లక్ష డిడిని అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీను, గుజ్జుల రమణారెడ్డి, ఉ డుముల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment