జూలై 1 నుంచి కూత పెట్టనున్న కొత్త అంబులెన్స్ లు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
జూలై 1 నుంచి కొత్త 108 అంబులెన్సులు కూత పెట్టను న్నాయి. ఆధునిక సౌకర్యాలతో ఒకే రకమైన వాహనాలు కుయ్ కుయ్ మంటు గ్రామాల్లో సందడి చేయనున్నాయి. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 10 60 వాహనాలను సిద్ధం చేసింది. ఈ 108 వాహనాలను జూలై నెలనుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు ఆనారోగ్యానికి గురైతే రవాణా సౌకర్యం కల్పించాలని 108 వాహనాలను ఏర్పాటు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 108 వాహనాల నిర్వహణపై నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో వాహనాలు మూలకు చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలిస్తున్న వాహనాలు మొరాయించడం సర్వసాధారణమైపోయింది. ఉద్యోగులకు సైతం వేతనాలు అందని దుస్థితి. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక హంగులతో నూతన వాహనాలను ఆసుపత్రులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 10 60 వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. లాక్ డోన్ అనంతరం ఈ అంబులెన్స్లను ఆస్పత్రులకు కేటాయించనున్నారు. ఒకే రోజు ఈ వాహనాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వాహనాలు రానున్నాయని తెలియడంతో సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తుంది.
No comments:
Post a Comment