కరోనా నియత్రణకు అహర్నిశలు శ్రమిస్తున పోలీస్ సిబ్బందికి పాదరక్షలు వితరణ చేసిన సూరాడ బంగార్రాజు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం:కరోనా వైరస్ ప్రభావం నానాటికి పెడుతున్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ బారి నుండి ప్రజలను కాపాడడం కోసం నిరంతరం శ్రమిస్తున్న పరవాడ పోలీసు సోదరులను గౌరవిస్తూ తిక్కవానిపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి సురాడ బంగారు రాజు తన సొంత నిధులతో 48 మంది పోలీస్ సిబ్బందికి పాదరక్షలు(షూస్) ని సమకూర్చగా వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర సి.ఈ. సి సభ్యులు పయిల శ్రీనివాసరావు,మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు లు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో సిబ్బందికి అందజేసారు.కార్యక్రమంలో భాగంగా పోలీసు సోదరులకు సహాయం చేసిన బంగారురాజు ని సి.ఐ రఘువీర్ విష్ణు అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల వైసిపి పార్టీ ఉపాధ్యక్షుడు బొంది అచ్చిబాబు,మాజీ ఎం.పి.టి.సి సభ్యులు తిక్కాడ సత్యనారాయణ,సూరాడ తాతారావు, హరీష్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment