Followers

మారిటైం బోర్డు ఛైర్మన్ గా జి శ్రీధర్ రెడ్డి


 


మారిటైం బోర్డు ఛైర్మన్ గా జి శ్రీధర్ రెడ్డి


(పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం )


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ గా విశాఖపట్నంకు చెందిన మిలీనియం సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత జి శ్రీధర్ రెడ్డి (మిలీనియం శ్రీధర్ రెడ్డి) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తన స్వయంకృషితో ఎదిగారు. వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజానీకానికి జి శ్రీధర్ రెడ్డి అంటే అసలు తెలియదు. ఆయన తన సంస్థ పేరునే తన పేరుగా మార్చుకుని మిలినీయం శ్రీధర్ రెడ్డిగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. ఇంటి పేరును పక్కన పెట్టి మరీ సంస్థ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న కృషీవలుడు శ్రీధర్ రెడ్డి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 90వ దశకం చివరలో మిలీనియం సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచి కంప్యూటర్ విద్యను అందించిన విద్యాదాతగా జిల్లా ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అటువంటి మహౌన్నతమైన విలువలు కల్గిన శ్రీధర్ రెడ్డికి ఈ పదవి లభించడం పట్ల ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ అభినందనలు తెలియజేశారు. తనకు అప్పగించిన ఈ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, తనను గుర్తించి పదవి అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...