పట్టాలమ్మ తల్లి కమిటీ అన్నదానం
పెన్ పవర్ , నర్సీపట్నం
పాములవాక గ్రామం పట్టాలమ్మతల్లి ఆలయకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సీపట్నం వుడా పెట్రోల్ బంక్ వద్ద అన్నదాన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.లక్ష్మీ శివ జ్యోతి, టౌన్ సిఐ స్వామి నాయుడు, కృష్ణా ప్యాలస్ యజమాని బంగారుబాబు పాల్గొని అన్నదానం చేశారు. ఆలయ ధర్మకర్త ఎస్. వి. రమణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి పట్టాలమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు నర్సీపట్నం పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని, లాక్ డాన్ పూర్తయ్యేవరకు నర్సీపట్నం ప్రాంతంలో అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment