జీవీఎంసీ 5 వార్డులో టిడిపి నాయకురాలు మొల్లి హేమలత ఆధ్వర్యంలో ప్రజలఅందరికీ కూరగాయలు పంపిణీ....
మధురవాడ, పెన్ పవర్
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ 5 వార్డు టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు కుమార్తె 5వ వార్డు అభ్యర్థి మొల్లి హేమలత, ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసరాలు కొనుగోలు కు సతమతమవుతున్న 5 వార్డు ప్రజలందరికీ తనవంతు సహాయంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిల్లా,నరసింహారావు, పిల్లా, వెంకట్రావు హాజరయ్యారు, వారి చేతుల మీదుగా ప్రజలకు కూరగాయల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లా నర్సింగరావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని,వార్డ్ ప్రజలందరికీ ఇటువంటి సందర్భాల్లో సేవాదృక్పథంతో ముందుకు వచ్చి నటువంటి మొల్లి హేమలత ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనిఅభినందించారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వాలు, పోలీసులు ఇస్తున్న సూచనల ప్రకారం గుంపులు గుంపులుగా వీధుల్లో తిరగవద్దుఅని, నిత్యావసరాలకు ఒక ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని, ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు ఎవరు రావద్దని చేయి,చేయి కలిపి లాక్ డౌన్ ను విజయవంతం చేద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి లక్ష్మణరావు, వి.అప్పలరాజు, మల్యాల సోంబాబు, నమ్మి శ్రీను, ఈగల రవి, వార్డ్ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ (జపాన్), నాగోతి శివాజీ, నాయుడుసూరిబాబు, వి. బాబులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment