5 వార్డ్ స్వతంత్రనగర్ లో మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ.
మధురవాడ, పెన్ పవర్ : సునీల్
మదురవాడ 5వ వార్డు ప్రజలకు టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో 5 వార్డ్ స్వతంత్రనగర్ ప్రజలకు కూరగాయల పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ సందర్బంగా ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్లకే పరిమితం కావడంతో పేద ప్రజలకు జీవనోపాధి కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో తన వంతు సహాయంగా 5 వార్డు ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. బుధవారం శివశక్తినగర్ నుండి ప్రారంభమైన పంపిణీ కార్యక్రమం శనివారం స్వతంత్రనగర్, గణేష్ నగర్, గ్రామాల్లో నిర్వహించారు . ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ చేయుట లో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, జివిఎంసి సిబ్బందికి, డాక్టర్లకు, పత్రిక విలేకరులకు లక్ష్మణరావు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వాండ్రాసి అప్పలరాజు, నాగోతి శివాజీ, వాసుపల్లి బండయ్య ,జోగేశ్వర పాత్రో, కొత్తలశ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment