Followers

వైకాపా నేత పలకా రవి పేదలకు చేయూత


 

వైకాపా నేత పలకా రవి పేదలకు చేయూత

 

అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్ 

 

లాక్ డౌన్  నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తామని 84 వ వార్డ్ వైకాపా ఇంచార్జ్  పలకా రవి  పేర్కొన్నారు. విలీన గ్రామం అయినా కొత్తూరు నర్సింగ్ రావు పేట  లో ఆదివారం పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధిని తరిమి కొట్టడం లో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిిక దూరాన్ని పాటించాలన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఎమ్మెల్యే అమర్నాథ్ సూచనల మేరకు పేదలకు అండగా నిలుస్తామనారు. 250 కుటుంబాలకు బియ్యం,  కూరగాయలు ,మాస్కులు  పంపిణీ చేశారు.కార్యక్రమంలో. వైసిపి నాయకులు పీలా తులసి, కరణం సురేష్,   గొల్లవిల్లి అప్పారావు ,ఎ కనకరాజు, వి కుమార్, గొల్లవిల్లి రమణ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...