Followers

పేదవారికి,రోజువారీ కూలీలకు కూరగాయల పంపిణీ


గాజువాక, పెన్ పవర్ 


ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న వ్యాధి  కోవిడ్ -19 (కరోనా), దీని వలన ప్రపంచం మొత్తం లోక్ డౌన్  చెయ్యబడింది. దీని వలన పేదలు,రోజువారీ కూలీలు, వలస కార్మికులు ఆహారం లేక చాల ఇబ్బందిపడుతున్నారని గమనించి,హ్యూమన్ రైట్స్ మిషన్ స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ జిల్లా యంత్రాంగం 300 మంది పేదవారికి,రోజువారీ కూలీలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో  జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ విశ్వనాథ్,వైస్ ప్రెసిడెంట్ డీటీవీఎన్ స్వామి, జిల్లా లీగల్ సెక్రటరీ  కాండ్రేగుల లీలా హరిప్రసాద్ , మరియు వైస్ ప్రెసిడెంట్  మల్లేశ్వర రావు మరియు కృష్ణమూర్తి ఆధ్వర్యం లో కార్యక్రమం నిర్వహించబడింది మరియు ఆ కాలనీ పెద్దలు కేబుల్ శ్రీను , చిన్నారెడ్డి, ఎస్వీ.రమణ, పిఎస్. అప్పారావు గారు,డి. నానాజీ,ఏం.పవన్ కుమార్, డి.రాజు, ఏ.హరీశ్,తేజ,అశోక్,దుర్గాప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...