జగ్గంపేట, పెన్ పవర్: రమ్య
జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని గుడ్ సమరిటన్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ రెవరెండ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ నేపథ్యంలో గృహాలు కే పరిమితమైన కొంతమంది పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో భోజనాలను పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం పాస్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తన ఇంటి వద్ద భోజనాలను వండించి వాటిని ప్యాకింగ్ చేయించి గ్రామంలోని లెప్రసీ కాలనీ, ఎస్సీ కాలనీలో పలువురికి నివాసాల వద్దకు వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ డోర్ డెలివరీ గా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ అమలులో ఉన్నందున పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మా యొక్క గుడ్ సమరిటన్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రతిరోజు వంద మందికి చొప్పున భోజనాలు తయారు చేసి అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది పేదలకు అవసరాలను అర్థం చేసుకుని నగదును సహాయం చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుణం సుబ్బలక్ష్మి, గద్దె విజయ్ కుమార్, గద్దె రాజశేఖర్, కాతేటి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment