Followers

మీడియా ప్రతినిధులకు నిత్యవసర సరుకులు పంపిణీ : మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


జగ్గంపేట నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం బస్తా అందించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


జగ్గంపేట, పెన్ పవర్ : రమ్య


తూర్పు గోదావరి జిల్లా  స్థానిక జగ్గంపేట జ్యోతుల నవీన్ గారి ఇంటివద్ద జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట. కిర్లంపూడి. గోకవరం. గండేపల్లి. మండలాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు 25 కేజీల బియ్యం బస్తా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ  జిల్లా పరిషత్ మాజీ చైర్మన్  జ్యోతుల నవీన్  చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల లాక్ డౌన్ విధిస్తే ప్రజలందరూ గృహాల కే పరిమితమై కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు పాటించారు మళ్లీ లాక్ డౌన్ కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉన్నదని ప్రతి ఒక్కరు  అవసరమైతే మళ్లీ ఇళ్లకే పరిమితం అవ్వాలని తెలియజేశారు ఎప్పటికప్పుడు తమ వార్తాపత్రికలు ఛానెల్స్ ద్వారా  ప్రజల్లో అవగాహన కల్పించి   ప్రజలకు వారధిగా నిలబడిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా నాయకుల మరియు కార్యకర్తలందరూ సహకారంతో  ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు నాయకులు కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూరగాయలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కందుల కొండయ్య దొర ఎస్విఎస్ అప్పలరాజు కోర్పు లచ్చయ్య దొర మారిశెట్టి భద్రం  జీను మణిబాబు పాండ్రంగి రాంబాబు చదరం చంటిబాబు కొర్పు సాయి తేజ కన్నబాఋ భరత్ బాబు కాళ్ల దొంగబాబు  అడబాల భాస్కర్ రావు యర్రం శెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...