Followers

విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో మరో మైలు  రాయి.


విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో మరో మైలు  రాయి.

 

  స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)

 

104- ఏరియా ఎల్ సి 493  రైల్వే గేట్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది.  సుదీర్ఘకాలంగా వేచి ఉన్నా ఈ అండర్ పాత్ పనులు ఈ రోజు తిరిగి ప్రారంభించారు , ఒక్కరోజు కట్ అండ్ కవర్ పద్ధతిలో కేవలం తొమ్మిది గంటల్లో ఆరు మీటర్ల ఎత్తు 11 మీటర్ల వెడల్పుతో పూర్తి చేశారు.  ఈ పనులను గనబాబు  పర్యవేక్షించారు. ఈ అండర్ పాత్ వల్ల ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు.ముఖ్యంగా   దేశవానిపాలెం, అశోక పార్క్, ఎన్ఏడి కోటర్స్,  మేఘాద్రి పేట ఏరియా లో నివసించే వారికి మరియు ఎస్ బి సి డాక్ యార్డ్ ఎంప్లాయిస్ , డిఫెన్స్ ఎంప్లాయిస్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో రైల్వే గేట్ సమస్య తీరింది అని తెలియజేశారు.ఇది నియోజకవర్గంలో రామ్మూర్తి పంతులు పేట  పాత్ లా మరో మైలురాయి అని గుర్తు చేసుకున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...