Followers

రోమన్ కాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణి


 


రోమన్ కాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణి



ఎటపాక, పెన్ పవర్ : అగ్నిపర్తి వెంకటేశ్వర్లు 


 


కరోన నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను బట్టి ఎటపాక మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బందులు పడుతున్న 50 కుటుంబాలకు రెవ.పా.కొమ్ము అంతోని ఫాదర్ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యవసర వస్తువులైన కూరగాయలను రేవ.పా.కొమ్ము అంతోనీ ఫాదర్ చేతుల మీదుగా పంపిణి చేశారు.ఈ సందర్భంగా అంతోని ఫాదర్ మాట్లాడుతూ నెల్లిపాక లో గల రోమన్ కాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నామని పేర్కొన్నారు.లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రంబాల.నాగేశ్వరరావు,సిస్టర్స్ ,డాక్టర్.శ్రీను,గ్రామ వాలంటరీలు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...