రెడ్ జోన్ నేపథ్యంలో మహిళ ఆత్మహత్య
ఒంగోలు ,.పెన్ పవర్
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం లోని ఇస్లాంపేట లో షేక్ మేహరునిస్స బేగం(58) అనే మహిళ గురువారం నాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
స్థానికుల వివరాల మేరకు కరోనా నేపథ్యంలో పట్టణంలోని ఇస్లాంపేట ను రెడ్ జోన్ గా ప్రకటించడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదే క్రమంలో ఆ మహిళకు అనారోగ్య సమస్యలు ఉండటంతో మందులు మరియు నిత్యవసర సరుకులు అందకపోవడంతో మనస్తాపనీకి గురై ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.
No comments:
Post a Comment