అన్నవరం గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ
భీమిలి, పెన్ పవర్
భీమిలీ నియోజకవర్గంలోని అన్నవరం గ్రామంలో దివిస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ ఆర్కే మినా, దివిస్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొని.. ఏడు వెల మందికి , 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు పలు రకాల వస్తువులను స్థానిక ప్రజలకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. మత్యకారులను ఆడుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని..మంత్రి వర్యులు తెలిపారు. దివిస్ వల్ల నష్టం పోయిన గ్రామాలకు దత్తత తీసుకొని న్యాయం చేయాలని మంత్రి వర్యులు చెప్పారు.
No comments:
Post a Comment