లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం
(పెన్‌పవర్, పొదిలి)
పట్టణంలోని బిసి కాలనీ రామాలయం వద్ద కరోనా వైరస్ నేపథ్యంలో పనులు లేక అవస్థులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు. దాతల సహకారంతో నడుస్తున్న ఈ అన్నదానంకు లాల్ ఫౌండేషన్ నిర్వాహకులు ఆరీఫ్ అహ్మద్, ఆకీబ్ అహ్మద్, లాల్ అహ్మద్ ఒక రోజు భోజనంకు అయ్యే ఖర్చును అందజేసి కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ సమయంలో పేదలకు చేసుకునేందుకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్ధేశ్యంతో తన వంతు సాయంగా అన్నదానం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భోజనాల సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా సచివాయం 4 వ హెల్త్ సెక్రటరి కె శార, వాంటీర్లు నరేష్, మౌలాలి, చెన్నకేశవులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాష, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు దాసరి గురుస్వామి, సిపిఎం నాయకులు ఎం రమేష్, ఎం సురేష్, జి రమణారెడ్డి, జి సురేష్ తదితయి పాల్గొన్నారు.
No comments:
Post a Comment