అధికారులు ప్రజల్లో భయాందోళనలు దూరం చేయాలి. పర్యాటకమంత్రి అవంతి శ్రీనువాస్ .
ఎస్.రాయవరం.... పెన్ పవర్.
నియోజకవర్గంలోని అరట్లకోట గ్రామ ప్రజలు మరియు పాయకరావుపేట పరిసర గ్రామాల ప్రజలలో నెలకొన్న భయాంధోళనలను తొలగించేదిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనువాస్ ఆదేశించారు. ఆదివారం ఉదయం రాయవరం మండలపరిషత్ సమావేశమందిరంలో నియోజకవర్గస్థాయి అధికారుల రివ్యూ సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులనుండి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అధికారులు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా పాయకరావుపేట రాజుగారిబీడులో నివసిస్తున్న ఉపాధ్యాయుడు కరోనా బారిన పడడంతో ఆయన స్వగ్రామంతో కలసి కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించిన నేపధ్యంలో ఆప్రాంత ప్రజలలో విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారన్నారు.ఆ ప్రాంతాలకు నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతోపాటు ప్రజలకు భరోసా కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. తమలపాకు రైతులకు ట్రాన్స్ పోర్టు ఏర్పాటుచేసి వారికి ఎన్వోసిల ద్వారా వారికి నష్టం రాకుండా చూడాలన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగు మండలాల ఆరోగ్యకేంద్రాల వద్ద అంబులెన్సులు అద్దెకు ఏర్పాటు చేయాలని సూచించారు.అన్ని పంచాయితీలలో పారిశుద్ధ్యలోపం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కార్డులేని వారికి బియ్యం సరఫరా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి బి సత్యవతి ఎమ్మెల్యే జి బాబూరావు, ఆర్డీవో శివలక్ష్మి డిఎం అండ్ హెచ్వో నాలుగు మండలాల ఎంపిడివోలు,తహశీల్ధారులు, వైద్యులు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment