Followers

హైట్రో డ్రగ్స్  రసాయన ట్యాంకు లో   ప్రమాదానికి గురైన ఇద్దరు ఉద్యోగులు


హైట్రో డ్రగ్స్  రసాయన ట్యాంకు లో   ప్రమాదానికి గురైన ఇద్దరు ఉద్యోగులు..
  ఒకరు మృతి  మరొకరికి ఆసుపత్రిలో  చికిత్స.


 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)


 


హెటోరో  ఔషధ  పరిశ్రమలో  మంగళవారం జరిగిన  ప్రమాదంలో  ఒక ఉద్యోగి  మృతిచెందగా  రెండో వ్యక్తి  ప్రాణాపాయ స్థితిలో  ఆస్పత్రిలో  వైద్యం అందిస్తున్నారు. జిల్లాలోని  నక్కపల్లి  మండలంలోని హెటోరొ   ఔషధ కర్మాగారంలో  రసాయన ట్యాంకు  శుద్ధి చేస్తుండగా జూనియర్ కెమిస్ట్రీ  గాడి శ్రీను 29  షిఫ్టు ఇంచార్జ్  యు ఎన్ అప్పారావు నైట్రోజన్   ప్రభావం వల్ల  అపస్మారక స్థితిలో   ట్యాంకులో పడిపోయారు.  వీరిని   విశాఖ  ఆస్పత్రికి తరలిస్తుండగా  శ్రీను మార్గమధ్యంలో మృతిచెందాడు. నక్కపల్లి ఎస్ ఐ  శివరామకృష్ణ  అందిన సమాచారం మేరకు  తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం  కెఏ మల్లవరం  గ్రామానికి చెందిన  గాడి శ్రీను  హెటిరో డ్రగ్స్ కంపెనీలో  జూనియర్ కెమిస్ట్రీ గా  పని చేస్తున్నాడు. యధావిధిగా  విధులకు హాజరైన  శ్రీను  యూనిట్ 3 హెచ్   బ్లాకులో రసాయన  ట్యాంకు  శుభ్రం చేస్తుండగా  ప్రమాదం  చోటు చేసుకుంది. ట్యాంకు  హెడ్  శుభ్రం చేసి  ట్యాంకులో  దిగిన  శ్రీను నైట్రోజన్  ప్రభావానికి  గురై  ట్యాంకులో  పడిపోయాడు.  అతన్ని రక్షించేందుకు  ప్రయత్నించిన  షిఫ్ట్ ఇంచార్జ్  యు ఎం అప్పారావు  కూడా  ట్యాంకు లొ  పడిపోయాడు. గమనించిన  సీనియర్  కెమిస్ట్రీ  సిబ్బంది సహాయంతో  ఇద్దరిని   బయటకు తీసి  ఆస్పత్రికి తరలించారు. శ్రీను మార్గమధ్యలో  మృతిచెందగా  అప్పారావు వైద్యం అందుకుంటున్నాడు. మృతుడు శ్రీనుకు  రోలుగుంట మండలం  లింగాపురం కు చెందిన  రోహిణి కుమారితో  డిసెంబర్ 11న  వివాహమైంది. విధులు నిర్వహించే ఫ్యాక్టరీ   దగ్గరలో   ఉన్నందున   శ్రీను  అత్తారింట్లో  మకాం పెట్టాడు.  పెళ్లై నాలుగు నెలలు  గడవక ముందే తన భర్త    కాన రాని లోకాలకు  తరలి పోయాడు అని  భార్య రోహిణి విలపించింది.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...