బైకును ఢీకొన్న లారీ. మహిళ మృతి
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. బిర్లా జంక్షన్ నుండి ఎన్ఏడి జంక్షన్ వైపు బైక్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. ఆ సమయంలో ఎన్ఏడి వైపునుంచి తౌడు లోడుతో నగరంలో కి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అప్పల నరసమ్మ 23 లారీ కింద పడి మృతి చెందింది. బైకు లారీ ఢీకొట్టడంతో ఆమె లారీ టైరు కింద పడిపోయింది. లారీ కొంత దూరం ఆమెను ఈడ్చుకు పోయింది. ఈ సంఘటనలో తల నుజ్జునుజ్జయింది. కళ్ళముందే కట్టుకున్న భార్య లారీ కింద పడి చనిపోయిన సంఘటన భర్త జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment