కరోనా మహామ్మారిని నుండి రక్షణ చర్యల్లో భాగంగా విధులు
ప్రభుత్వ సిబ్బందికి సహాకరిస్తున్న పారిశ్రామికవాసులు
సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తున్న పలు సంస్దలు
గాజువాక , పెన్ పవర్
కరోనా మహామ్మారి నుండి యావత్ భారత దేశ ప్రజను కాపాడటానికి దేశప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న లాక్‌డౌన్‌ను విధిగా అందరు పాటిస్తూ దేశ జౌన్యత్యాన్ని చాటిచెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు , జర్నలిస్టులు తమ భాద్యతను నేరవేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తూన్నారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేమం కోరకు తమ కర్తవ్యదీక్షను నెరవేరుస్తూన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులను నిర్వహిస్తూన్న సిబ్బందికి తమ వంతు తోడ్పాటుగా డిలిశ్యాస్ కెటరింగ్, కావ్యఎంటర్‌ప్రైజస్ సౌజన్యంతో గాజువాక పెన్‌పవర్ టీం, స్దానిక యువత వాటర్ బాటిల్స్,మజ్జిగ ప్యాకెట్లు , పండ్లు అందజేసీ తమ సేవా నిరతిని చాటుకున్నారు. కార్యక్రమంలో పెన్ పవర్ గాజువాక పెన్ పవర్ విలేఖర్లు బి.శ్రీనివాస్, ఫిరోజ్,నానీ, సాయి, మణికంఠ, శ్రీనివాస్,స్దానిక యువత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment