5000 లీటర్ల బెల్లం ధ్వంసం
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నాటు సారా తయారీ కేంద్రాలపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. పొదల్లో తోటల్లో రహస్యంగా సారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు ఆయా ప్రదేశాల పై దాడులు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో నాటు సారా తయారీ అమ్మకాలు జోరందుకున్నాయి. నాటుసారా నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మాడుగుల ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల జగదీశ్వరరావు గురువారం స్టేషన్ పరిధిలో పలుచోట్ల దాడులు చేపట్టారు ఈ దాడుల్లో సుమారు 5000 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం చేశారు. పొంగలిపాక జాలం పల్లి గదబూరు పొన్నవొలు గురు వాడ తదితర గ్రామాల్లో నాటు సారా తయారీ కి ఉపయోగించే బెల్లం పులుపు ధ్వంసం చేశారు. గ్రామ వాలంటీర్ల సహకారంతో నాటుసారా నిర్మూలనకు ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్రమంగా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ జగదీశ్వర రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రావణి సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment