Followers

జ్యోతి వెలుగులతో ఐక్యతను చాటిన భారతీయం


జ్యోతి వెలుగులతో ఐక్యతను చాటిన భారతీయం


కరోనా పై దీప కాంతులతో పోరాటం


పెన్ పవర్ ;జమ్మలమడుగు 



జమ్మలమడుగు పట్టణంలో ప్రధాని మోడీ పిలుపుమేరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు దీప కాంతులతో కరోనా పై పోరాటం చేశారు ఎటువంటి   సందేహం ,ఆందోళన వ్యక్తం చేయకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలను ఆర్పివేసి  భారతదేశం అంతా ఒకే మాటపై నిలబడతారని ప్రపంచానికి చాటి చెప్పారు ఇప్పటికే కరోనా ను కట్టడి చేయడంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందడుగు లో ఉందని ప్రపంచమంతా చెప్పుకొస్తున్నారు ఈరోజు రాత్రి దీప కాంతులతో జమ్మలమడుగు లోని వీధులన్నింటిలో ప్రజలు ,పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి  మద్దతు గా  ఉంటారని  ప్రజలు నిరూపించారు,మరొకసారి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు భారతదేశం సాంప్రదాయక దేశమని సాంప్రదాయ పద్ధతులలో ముఖ్యమైనది దీపారాధన ఆ దీపారాధన ద్వారా కరోనా కట్టడికి పిలుపునిచ్చిన ప్రధాని మోడీ ఆశయాన్ని ప్రజలందరూ  పాటించారని తెలుస్తుంది.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...