Followers

రెడ్ జోన్ ప్రాంతం ఆకస్మిక తనిఖీ



 







పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్   ఏలూరు  పట్టణము నందు కత్తేపు విధి లో  ఉన్న రెడ్ జోన్ ప్రాంతామును  ఆకస్మికంగా తనిఖీ

 

 

పెన్ పవర్, పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ : రాము 

 

 

 

 

ఈరోజు అనగా 10.4.2020 వ తేదీ నాడు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్  వారు ఏలూరు  పట్టణము నందు కత్తేపు విధి లో  ఉన్న రెడ్ జోన్ ప్రాంతామును  ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు. సదరు రెడ్ జోన్ ప్రాంతాలలో పికెట్ ల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు సలహాలు తెలియజేస్తూ, రెడ్ జోన్ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి  ప్రజలు లు నిత్యావసర వస్తువులకు గాని మరి ఏ ఇతర అవసరాలు గాని రెడ్ జోన్ ప్రాంతము నుండి బయటికి రాకూడదని, సదరు రెడ్ జోన్ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు వారికి అవసరమయ్యే  అన్ని విషయాలలో ప్రజలకు  డోర్ డెలివరీ ద్వారా, లేదా వాలంటరీ ల ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తారని ఎవరికైనా ఏవిధము అయినా అత్యవసర పరిస్థితులు ఏర్ప డితే  helpline కు తెలియజేయాలని. రెడ్ జోన్ ప్రాంతాలకు వెళ్ళే రహదారులన్నీ దిగ్బంధనం చేయాలని బయటికి వెళ్ళుటకు లోపలకి వచ్చుటకు ఒకటే మార్గాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ. ప్రజలందరూ నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తము గా ఉదయం 6 గంటలనుండి ఉదయం 9 గంటల వరకు ఇంటికి ఒకరు చొప్పున బయటకు వచ్చి నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో మనిషికి మనిషికి రెండు మీటర్ల మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తూ వస్తువులను కొనుగోలు చేసిన వెంటనే తమ తమ ఇళ్ళకు వెళ్లాలని. ముఖ్యంగా ప్రజల గమనించవలసినది ఏమనగా ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా  మాస్క్ లు ధరించాలి అని జిల్లా ఎస్పీ  తెలియజేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియమ నిబంధనలు ది 23. 3 .2020 వ తేదీ నుండి ఇప్పటి వరకూ అనగా 09.04.2020 వ తేదీ  వరకు లాక్ డౌన్ సందర్భంగా నియమ నిబంధనలు అతిక్రమించిన 915 మంది పై ఐపిసి కేసులు నమోదు పరిచినట్లు 4025 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు వారి వద్ద నుండి   11,67,228/-,రూ.లు స్వా దినపరుచుకొన్నట్లు.  1193 వాహనములను స్వాధీనం చేసుకున్నట్లు 11,677ఎం.వి. యాక్ట్ ప్రకారం కేసు లు నమోదు పర్చి  58,38,500/- రూ. అపరాధ రుసుము విధించినట్లు, 41  కోడిపుంజులను 40  కోడి కత్తులను, 403 లిక్కర్ బాటిల్ అను 492 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్న నట్లు గా తెలియజేసినారు.


 








 


 






 

 




 




 


 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...