కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగించి ప్రార్థనలు నిర్వహిస్తున్న ఆరుగురు వారిపై కేసు నమోదు
పెన్ పవర్, గోపాలపురం : రాము
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ, వి. సుబ్రహ్మణ్యం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి గుడ్ ఫ్రై డే సందర్భంగా స్థానిక రజక పేటలోని ఒక ప్రార్థనా మందిరంలో ప్రార్థన నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ, లాక్ డౌన్ నిబంధనల మేరకు ప్రార్థనా మందిరాల్లో గాని, మసీదులో గాని, దేవాలయాల్లో గాని,ఎటువంటి పూజలు ప్రార్థనలు నిర్వహించటం చట్టరీత్యా నేరం అన్నారు. దానిని ఉల్లంగిస్తే కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment