పరీక్షలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చైతన్యపరచాలి
కమాండ్ కంట్రోల్ రూమును పరిశీలించిన జిల్లా కలెక్టర్
విజయనగరం, పెన్ పవర్
కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్-19పై ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, ఎస్‌పి బి.రాజకుమారితో కలిసి ఆదివారం పరిశీలించారు. అక్కడినుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలను, ఏర్పాటు చేసిన విభాగాలను, వాటి విధులను అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్ వారికి వివరించారు. క్యూఐసి, క్వారంటైన్, సర్వైలెన్స్, హూమన్ రీసోర్స్, డాటా అనలైజింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేశామని గార్గ్ చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తదితర కరోనా లక్షణాలు ఉన్నప్పడు పరీక్షలు చేయించుకొనేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు వారికి దైర్యం, నమ్మకం కల్పించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పనిచేయాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించడమే కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అదేవిధంగా తరచూ చేతులను సబ్బుతో కడుకొనేలా చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment