హత్య కేసులో ముద్దాయి అరెస్ట్
మహిళ హత్య కేసులో ముద్దాయి ని అరెస్టు చేసిన జగ్గంపేట పోలీసులు ...
జగ్గంపేట, పెన్ పవర్
మార్చి 28 వ తేదీన మహిళను హత్య చేసిన కేసులో నిందితుడును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వై రాంబాబు మాట్లాడుతూ జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలోని అత్తులూరి శ్రీనివాసరావు కు చెందిన జీడి మామిడి తోటలో కాపలా దారులుగా పనిచేస్తున్న రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశులు, రంపచోడవరం మండలం సిరికిందలపాడు గ్రామానికి చెందిన నేషం లక్ష్మి అను వీరిద్దరూ ఆ తోటలో కాపలాదారులు గా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే మార్చి నెల 28వ తేదీ శనివారం నాడు వెంకటేశులు కోడిని తీసుకువచ్చి కూర ఉండాలని చెప్పడంతో అందుకు లక్ష్మి అంగీకరించకపోవడంతో వెంకటేశులు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై కర్రతో విచక్షణారహితంగా కొట్టడం జరిగింది దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె 29వ తేదీ నాడు మృతి చెందినట్లుగా గుర్తించిన అతడు ఆమె మృతదేహాన్ని వారి స్వగ్రామం రంపచోడవరం మండలం సిరికింతలపాడు తీసుకుని వెళ్లగా మృతురాలి కుమారుడు దీనిని గ్రహించి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జగ్గంపేట సి ఐ వై రాంబాబు, ఎస్ ఐ టి రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,శవ పంచనామా నిర్వహించారు అయితే పరారీలో ఉన్న ముద్దాయిని ఈ నెల 6వ తేదీ ఆదివారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ విఆర్వో ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు దీనిపై ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు కావడం జరిగిందని సిఐ రాంబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది సాక్షులను విచారించి,పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చార్జిషీట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుడు గత 20 సంవత్సరాలుగా భార్యను విడిచి దూరంగా ఉండటంతో సిరికింతల పాడు గ్రామానికి చెందిన లక్ష్మి 40.అనే మహిళకు భర్త చనిపోవడంతో ఆమెతో పరిచయం ఏర్పర్చుకొని నిందితుడు వెంకటేశులు లక్ష్మి కలిసి సహజీవనం చేస్తున్న తరుణంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ సమావేశంలో జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ గండేపల్లి మండలం ఎస్సైై తిరుపతి రావు పోలీసు సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment