విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్..... ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో ప్రజలను ఆదుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. పట్టణంలోని ఎనిమిదవ డివిజన్ శంకర మఠం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వాదశి వేణు ఆధ్వర్యంలో డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి ద్వాదశి సుమతి తమ స్వంత నిధులతో ఏర్పాటుచేసిన నిత్య అవసరాలను కోలగట్ల శ్రావణి చేతులమీదుగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటున్న, తన తండ్రి మరియు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి గారి సూచనలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా డివిజన్ల లో లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు. ఇప్పటివరకు జిల్లా లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఇదే స్ఫూర్తితో ప్రజలు లాక్ డౌన్ పాటిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఎనిమిదవ డివిజన్ లో రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి పది కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, కేజీ గోధుమ నూక అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, ఎనిమిదవ డివిజన్ పార్టీ నేతలు పల్లి సన్యాసిరావు, కరు మజ్జి సాయి , అయితా నాగరాజు , ఆదిరాజు సంతోష్, చిల్లా వాసు, ఆంజనేయులు, మూర్తి లతోపాటు మహిళా నేతలు శ్రీరంగం మంగాదేవి, చిల్లా పుష్ప, పిల్లా పద్మ తదితరులు ఉన్నారు. డివిజన్లో రేషన్ కార్డు లేని వంద కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు...
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment