అనుమతి లేని వారిని జిల్లా సరిహద్దులోనే నిలిపివేత : జిల్లా కలెక్టర్
గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలి
విజయనగరం, పెన్ పవర్
ఇతర ప్రాంతాల నుండి జిల్లాలోకి ప్రవేశించాలంటే జిల్లా యంత్రాంగం నుండి తప్పనిసరిగా అనుమతి పొంది వుండాలని, అనుమతి లేనివారిని జిల్లాలోకి రానిచ్చేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. అత్యవసర పనుల మీద జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి రావాలని భావిస్తే వారు వచ్చే జిల్లాల యంత్రాంగం నుండి అనుమతి పత్రం తీసుకురావలసి ఉంటుందని చెప్పారు. అనుమతి లేకుండా వచ్చే వారిని సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద నిలిపివేసి వెనక్కి పంపిస్తారని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద ప్రవేశాలను నియంత్రించేందుకు పోలీస్, రెవిన్యూ, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బందితో సంయుక్త బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అనుమతి లేకుండా జిల్లాలోకి ఎవ్వరూ ప్రవేశించాలని ప్రయత్నిచ వద్దని కోరారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున వలసదారులు ప్రవేశిస్తున్నట్టు సమాచారం వస్తోందని, ఎలాంటి వైద్య పరమైన తనిఖీలు చేయించుకోకుండా ఆయా గ్రామాల్లోకి ప్రవేశించే వారి పట్ల స్థానికులు అప్రమత్తంగా వుంటూ స్థానిక సచివాలయ, మండల అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. లేదంటే జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ కు 08922-236947 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment