మధురవాడ:, పెన్ పవర్ : సునీల్
మహా విశాఖపట్నం జివిఎంసి మధురవాడ పరిధి శుక్రవారం యు వి ఎస్ ఈవెంట్స్,( పీఎం పాలెం), బూర్ల సతీష్, యుసి కళ్యాణ్ చక్రవర్తి, సౌజన్యంతో మధురవాడ స్వతంత్ర నగర్ షిరిడి సాయిబాబా ఆలయ అర్చకులు అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు తనవంతు సహాయంగా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆనందపురం జంక్షన్ నుండి హనుమంతవాక జంక్షన్ వరకు అభాగ్యులకు,వలస కార్మికులకు,ఆశా కార్యకర్తలకు, నిరుపేదకుటుంబాలవారికి, పోలీస్ సిబ్బందికి, జీవీఎంసీ కార్మికులకు ఆహార పొట్లాలను, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. లాక్ డాన్ మొదలైన నుండి అధికార్ల కాళిదాసు ఆధ్వర్యంలో దాతల ఆర్థిక నిధులతో ప్రతిరోజు ఆహార పొట్లాలు, బిర్యానీ , మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు, వాటర్ ప్యాకెట్లు, వితరణ చేయడం జరుగుతూనే ఉంది అని లాక్ డౌన్ కొనసాగే రోజుల్లో మా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని,స్వతంత్ర నగర్ షిరిడి సాయి దేవాలయ ప్రధాన అర్చకులు అధికార్ల కాళిదాసు ఐన్యూస్ తో మాట్లాడుతూ మధురవాడ ప్రాంతంలో ఎక్కువగా దినసరి కూలీలు, పేద కుటుంబాల వారు కరొన వైరస్ వల్ల పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఎటువంటి లాభాపేక్ష,రాజకీయాలు లేకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని దాతలు ఎవరైనా ఉంటే స్వతంత్రనగర్ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఐ న్యూస్ కు వివరించారు. ఈకార్యక్రమంలో లోలుగు రమేష్ నాయుడు, కరకాని ఈశ్వరరావు, ఉగ్గిన నాగరాజు పాల్గొన్నారు.
No comments:
Post a Comment