Followers

పరిశ్రమ లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఆన్ లైన్ పోర్టల్ కు దరఖాస్తు చేసుకోవాలని


 


కాకినాడ, పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ : చినబాబు 


 


జిల్లాలో గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో లాక్ డౌన్ కారణంగా మూసిన  పరిశ్రమ లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతుల కోసం http://apindustries.gov.in/covid19/Public/User registration.aspx ఆన్ లైన్ పోర్టల్ కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి మురళీధరరెడ్డి ఒక ప్రకటనలో కోరారు.  ఈమేరకు జిఓ నెం.88,18.4.2020 లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్థేశాల మేరకు  ఇప్పటి వరకు   రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో 374 అనుమతులు తూర్పు గోదావరి జిల్లాలో జారీ చేశామని ఆయన తెలిపారు. ఆన్ లైన్ ద్వారా అందిన ధరఖా‌స్తులను జియం,డిఐసి, జడ్ యం, ఏపిఐఐసి, బిసి,లాబర్ లతో ఏర్పాటైన కమిటీ పరిశీలించి కలెక్టర్ ఆమోదం తో అనుమతులు ఆన్ లైన్ లోనే జారీ చేస్తుందని తెలిపారు. ఇందుకు ఆయా పరిశ్రమలు తమ కార్మికులు, నిర్వహణ సమాచారంతో వెబ్ పోర్టల్ లో రిజిస్టర్  చేసుకోవాలని తెలిపారు. గ్రీన్,  ఆరెంజ్ జోన్ లలో మాత్రమే నిబంధనలకు లోబడి ఈ అనుమతులు జారీ చేస్తామని, రెడ్ జోన్ లో ఎటు వంటి అనుమతులు జారీ కావని ఆయన తెలిపారు. తిరిగి తెరిచే పరిశ్రమలను దశల వారీగా షిఫ్టుల్లో ప్రారంభించాలని, స్థానిక మండలంలోని కార్మికులతో మాత్రమే పనిచేయించు కోవాల్సి ఉంటుందని తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...