Followers

విశాఖ  నగరానికి..కరోనా బూచి...


విశాఖ  నగరానికి..కరోనా బూచి...



              మూడవ దశ రూపం లో  ప్రమాదం  పొంచి ఉందా?



  రైల్వే న్యూ కాలనీ, అక్కయ్య పాలెం, తాటిచెట్ల పాలెం లలో   హై ..ఎలర్ట్.....


 ఆ ఏరియాలలో  అన్నీ రహదారులు  అష్టదిగ్బంధనం.  ఎక్కడి కక్కడ బారికేడ్లు.

     ( స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్ : మజ్జి  శ్రీనివాస మూర్తి )



కరోనా  వైరస్ మహమ్మరి  మూడవ దశ భయం  విశాఖ నగరాన్ని  వెంటాడుతుందా? అన్న అనుమానాలు  తలెత్తుతున్నాయి  నగరంలో  రెడ్ జోన్లు  రహదారుల అష్టదిగ్బంధనం, బారికేడ్లు  ఏర్పాటు, అధికారుల  హెచ్చరికలు   వెరసి  నగరానికి   మలిదశ కరోనా  భూతం పొంచి ఉందని  అందుతున్నాయి. కరోనా  వైరస్  విశాఖను  తాకిన  మొదటి దశ లొ   నాలుగు పాజిటివ్ కేసులు  నమోదయ్యాయి.  రెండవ దశ నిజాముద్దీన్ మత సదస్సుకు పోయి  వచ్చిన వారితో   మొదలైందని చెప్పవచ్చు .విశాఖలో  20  కేసులు  నమోదు కావడం,   మొదటి విడతలో  చేరిన  నలుగురు  డిస్చార్జ్ అయిన విషయం తెలిసిందే. వైరస్  నిర్ధారణ కావాలంటే  సుమారు 20 రోజులు  పడుతుంది.రెండో దశలో  వచ్చిన   కేసుల  కారణంగా   పాజిటివ్ కేసులు   నమోదు  అయ్యే పరిస్థితులు  కనపడుతున్నాయి. రైల్వే న్యూ కాలనీ,  తాటి చెట్ల పాలెం, అక్కయ్యపాలెంలలో  4 రోజుల క్రితం  ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  అధికార యంత్రాంగం  అప్రమత్తమై ఆయా ఏరియాలను రెడ్  జోన్ గా ప్రకటించి  కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేస్తున్నారు. రోడ్లు అష్టదిగ్బంధనం  ఇంటర్ రోడ్లు పై  ఎక్కడికక్కడ  బారికేడ్లు  ఏర్పాటు చేశారు. జనం  బయటకు రాకుండా   ఇతరులు   ఈ  ప్రాంతాల్లోకి రాకుండా  ఆంక్షలు విధించారు.  మే 4 వరకు   రెడ్ జోన్ల ప్రాంతాల్లో నిఘా  ఉంటుందని  అంటున్నారు.  ఇంకా  కొన్ని  శాంపిల్స్  రిజల్ట్  అందాల్సి  ఉంది.  రెండవ దశ  పాజిటివ్  కేసులు  మూలంగా  ఇంకా  వైరస్ సోకిన  వారు  ఉండొచ్చనే  ప్రచారం  లేకపోలేదు. ప్రస్తుతం  జిల్లాలో  నెలకొన్న   పరిస్థితుల దృష్ట్యా  అధికారులు  అప్రమత్తమైన ట్లు   సమాచారం.  వ్యక్తిగత దూరం  పాటించాలని   స్వీయ   నిర్బంధంలో  ఉండాలని  అధికారులు మోర పెడుతుంటే  ప్రజలు  అంతగా పట్టించుకోవడం లేదు. ఉచిత పంపిణీ, రైతు బజార్ల లలో ఎక్కడ చూసినా  గుంపులు గుంపులుగా జనాలు  కనిపిస్తున్నారు. పోలీసులు  కట్టడి చేయాలని  ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు  పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో   వైరస్ లక్షణాలు  ఎక్కడ ఎలా  బయట పడతాయో అన్న గుబులు  వెంటాడుతుంది. కరోనా వైరస్  నివురుగప్పిన నిప్పులా  పొంచి ఉందని  సంకేతాలు  అందడంతో  అధికారులు  ఉలిక్కిపడుతున్నారు.  గత రాత్రి  రాష్ట్ర మంత్రులు  జిల్లా అధికారులతో  కరోనా  వైరస్  పై  సమీక్ష జరపడం  విశేషం. జిల్లాలో  మూడో దశలో  కరోనా బూచి  లేకుండా  చూడాలని  జిల్లా యంత్రాంగం   రోజుకో  చర్యలు  చేపడుతున్నారు. ఇదిలా ఉండగా  కత్తిపూడి నుంచి  వచ్చిన  కేసు  మినహా   నగరంలో నాలుగు రోజులుగా  ఇటువంటి కేసు నమోదు కాలేదు.లాక్ డౌన్ కొనసాగిం పు పై  సందిగ్ధత కొనసాగుతోంది. కర్ఫ్యూ ఎత్తివేస్తే  విచ్చలవిడిగా  జనసంచారం  మొదలైపోతుంది. మరుగున దాగిన కరోనా  వైరస్  ఎక్కడ పడగ  విప్పు తుందో అన్న భయం ఇటు జిల్లా అధికారుల్లో అటు వైద్యుల్లో లేకపోలేదు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...