కరోనా వ్యాప్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించే చైతన్య రథయాత్ర
పెన్ పవర్, ఆత్రేయపురం
ప్రపంచ దేశాల్లో వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా వ్యాప్తి చెందే తరుణంలో మన భారత ప్రభుత్వం ముందుగానే మేల్కొని లాక్ డౌన్ విధించడం జరిగింది ప్రజలందరూ ఇళ్లల్లోనూ ఉండాలని అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో బయటికి రాకూడదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు అవగాహన లేక బయట సంచరిస్తున్న వేళ ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు స్టేట్ టీచర్స్ యూనియన్ (STU)కరోనా అవగాహన చైతన్య రథయాత్ర మెర్లపాలెం నుండి ప్రారంభించారు ఈ రథయాత్రకు కె. వి. శేఖర్ STU జెండాతో ప్రారంభించారు ఇందులో టీచర్లు పి. దయ సాగర్, జి .మాణిక్యాలరావు ఎం. దొరబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment