Followers

లారస్ ల్యాబ్ ఫార్మా కంపెనీని సందర్శించిన విజయ సాయిరెడ్డి


 


లారస్ ల్యాబ్ ఫార్మా కంపెనీని సందర్శించిన విజయ సాయిరెడ్డి


          పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ లోని లారస్ ల్యాబ్ ఫార్మా కంపెనీ ని సందర్శించిన వైఎస్ ఆర్ సిపి అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి. సోమవారం నాడు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి తో పాటు మంత్రి అవoతి శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి,పెదుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు లతో కలిసి లారస్ కంపెనీ ని సందర్శిచారు.అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కరోనా నియత్రణకు లారస్ ల్యాబ్ చేస్తున్న కృషికి అభినందించారు.కరోనా నియంత్రణలో భాగంగా లారస్ ల్యాబ్ యాజమాన్యం సామాజిక బాధ్యతతో    ముఖ్యమంత్రి సహాయనిధికి,జిల్లా కలెక్టర్ సహాయనిధికి,సీపీ సహాయనిధికి కంపెనీ ప్రతినిధి నరిసింహారావు విరాళాలు ఇచ్చారు అని ప్రశంసించారు.అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి స్వీయ నిర్బంధ వలన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను అదుకోవాలి అని ఇచ్చిన పిలుపు మేరకు లారస్ కంపెనీ చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలోని 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు అని అన్నారు.ఫార్మా సిటీలో ఉన్న మిగతా కంపెల వాళ్లు కూడా లారస్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వచ్చి సామాజిక భాద్యతలో పాలు పంచుకోవాలి అని పిలుపునిచ్చారు.అనంతరం లారస్ ల్యాబ్ తరుపున చావా నరసింహరావు జివిఎంసి పారిశుధ్య కార్మికుల సహాయార్ధం కమిషనర్ పేరుతో 10 లక్షల చెక్ ను విజయ సాయిరెడ్డి కి అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, జిల్లా వైసిపి కార్యదర్శి చుక్క రామునాయుడు,వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు,కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...