Followers

మానవత్వం పరిమళించిన వేళా  


  మానవత్వం పరిమళించిన వేళా  


సాలూరు, పెన్ పవర్


సాలూరు పట్టణం వడ్డి వీధికి చెందిన కుసుమంచి రాజేశ్వరి , వయస్సు 80 సంవత్సరాలు.  తన భర్త చనిపోయి సుమారు 15 సంవత్సరాలు అయినది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు , ఒక కొడుకు సంతానం కలరు. ఆమె తన యొక్క ఆస్తిని తన ముగ్గురు పిల్లలకు పంచి తన కుమారుడు అయిన కుసుమంచి సన్యాసిరావు   వద్ద వుంటున్నది . ఆమె కుమారుడు అయిన సన్యాసి రావు చిన్న పాన్ షాపు నడుపుకుంటూ పట్టణం లోని పెద్దకోమటి పేట లో తన భార్యా పిల్లలతో ఉంటున్నాడు .  సదరు రాజేశ్వరి గారు తన వయస్సు రీత్యా వినికిడి , కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతూ  తన పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో వున్నది. ఆమె ఉంటున్న తన కుమారుని ఇల్లు బాగా ఇరుకు కావడం వలన మరియు తన కోడలితో చిన్న చిన్న గొడవల కారణంగా తన కొడుకు నడుపుతున్న పాన్ షాపు మేడ మీద ఒక చిన్న డేరా అంచున వుంటూ ఎండ , వానల నుండి  పూర్తి రక్షణ లేక తన కొడుకు , కూతుళ్లు పట్టించుకోక ఎన్నో ఇబ్బందులు పడుతూ గతం లో హుద్ హుద్ తుఫాను సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇలా ఉండగా పట్టణం లోని వెంకట విధ్యాగిరి అనే ప్రయివేటు పాఠశాలకు చెందిన సాయి మాస్టారు సదరు మహిళ ఇబ్బందులను గమనించి నిత్యం ఆమె యొక్క ఆకలి  దప్పికలను తీరుస్తూ సదరు మహిళ యొక్క  దీన స్థితిని సాలూరు పట్టణ ఎస్. ఐ. గారి దృష్టికి తీసుకు రాగా   ఎస్. ఐ. గారు  సదరు మహిళ యొక్క కొడుకు , కూతుళ్లను పిలిపించి  కన్నతల్లిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మేడ  పై వదిలివేసినందుకు వారిని మందలించి వెంటనే ఆమెను మేడ  మీద నుండి ఇంటి లోనికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ  ఇల్లు  బాగా ఇరుకుగా ఉండటం వలన అందరూ కలిసి ఉండటానికి వీలు కాకపోవడంతో వెంటనే ఎస్. ఐ. గారు సదరు మహిళ యొక్క పిల్లలు మరియు కొంతమంది దాతల సహాయం తో మేడమీద గల డేరా స్థానం లో శాశ్వతమైన బ్లూ కోటెడ్ షీట్లతో ఒక షెడ్ ను నిర్మించి ఆమెకు వర్షం , ఎండ తాకిడి లేకుండా ఏర్పాటు చేసారు మరియు ఆమెకు పండ్లు అందించి, ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా సాయి మాస్టారు  గారి ద్వారా తన   దృష్టికి తీసుకు రావాలని తెలియజేసారు. ఆమె ఎంతగానో సంతోషించి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపి దీవించారు..


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...